కిర్రాక్ పార్టీ.. థియేటర్స్’లో రచ్చ రచ్చే.. !

శరన్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ – సంయుక్త హెగ్డే, సిమ్రన్‌ పరీన్జ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం “కిర్రాక్ పార్టీ”. కన్నడ సూపర్ హిట్ ‘కిర్రాక్ పార్టీ’కి రిమేక్ ఇది. ఈ చిత్రానికి దర్శకుడు సుధీర్‌వర్మ స్క్రీన్‌ప్లే అందించారు. మరో దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు రాశాడు. ఈ నెల 16న ‘కిర్రాక్ పార్టీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆదివారం రాత్రి విజయవాడలో ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో అల్లరి నరేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ మాట్లాడుతూ.. “నాకు నిఖిల్‌ని చూసినపుడల్లా డ్యూరో సెల్‌ బ్యాటరీ గుర్తుకొస్తుంది. మా ఆహుతి ప్రసాద్‌గారి అబ్బాయి కార్తీక్‌ ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు.

నిఖిల్ మాట్లాడుతూ.. “అల్లరి నరేష్‌ ఆడియో విడుదలచేసిన నా ప్రతి సినిమా సూపర్‌ హిట్‌. అలాగే ఈ చిత్రం సూపర్‌హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా. ఈ నెల 16న థియేటర్లలో రచ్చ రచ్చే. వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న సినిమా ఇదన్నారు”