ట్రైలర్‌ టాక్ : ‘కిరాక్‌పార్టీ’


కొత్త త‌ర‌హా క‌థ‌లు ఎంచుకొంటూ, విజ‌యాలు అందుకొంటూ ప్రయాణం సాగిస్తున్నాడు నిఖిల్‌. కేశ‌వ త‌ర‌వాత శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. అనిల్ సుంక‌ర నిర్మాత‌. అదే కిరాక్ పార్టీ .ఈ చిత్రాన్ని మార్చి 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.‘వాడు సీఎస్‌ఈ, ఈసీ, నేను మెక్‌ అనే భేదాభావాలొద్దు. మనమంతా ఒక్కటి. మన దెబ్బకు సీనియర్స్‌ అబ్బా! అనాలి’ అంటూ నిఖిల్ టీజర్ లో సందడి చేశాడు. స్నేహం, ప్రేమ, సీనియర్స్‌.. జూనియర్స్‌ మధ్య జరిగే గొడవలు ఇవన్నీ ఈ చిత్రంలో చూపించనున్నారు.. ‘ఫేస్‌బుక్‌ అని కొత్త పుస్తకం వచ్చింది. ఐదు వేలట. అది కొనకపోతే పాస్‌ చేయ్యరట నాయనా!’ అంటూ ఓ విద్యార్థి తన తండ్రిని ఫోన్‌లో డబ్బులు అడగడం నవ్వులు పూయిస్తోంది. ట్రైలర్ ను మీరూ చూడండి.