మహేష్ తర్వాత బన్నీనే !

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్’లో కొరటాల శివ ఒకరు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో “భరత్ అను నేను” సినిమా చేస్తున్నాడు. ఇందులో ఏకంగా మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

ఈ సినిమా తర్వాత కొరటాల శివ స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం వచ్చింది. రామ్ చరణ్ – కొరటాల సినిమా వాయిదా పడటంతో ఆ స్థానంలోకి అల్లు అర్జున్ వచ్చినట్టు తెలుస్తొంది.