కౌశల్ కంటతడి పెట్టించాడు

బిగ్ బాస్ 2 తెలుగు షో చివరి అంకానికి చేరుకొంది. ఇప్పటికే 94రోజుల షో పూర్తయ్యింది. ఇంకా మిగిలింది కొన్ని రోజులే. దీంతో బిగ్ బాస్ 2 విన్నర్ గా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది. మంగళవారం ఏపీసోడ్ లో ఇంటి సభ్యులని బిగ్ బాస్ సప్రైజ్ చేశాడు. వారి పిల్లలని ఇంట్లోకి పంపించారు.

దీప్తి, అమిత్ తనయులని చూసి మురిసిపోయారు. ఇక, పిల్లలు లేని సామ్రాట్ ని కలవడానికి ఆయన తల్లి వచ్చారు. బుధవారం నాటి షోలో కౌశల్ ఇద్దరు పిల్లలు హౌస్ లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే స్టార్ మా విడుదల చేసింది. ఇందులో తన ఇద్దరు పిల్లలని చూసి కౌశల్ ఎమోషనల్ అవ్వడం చూడొచ్చు. ఇది చూసిన ప్రేక్షకులు కండితడిపెట్టుకొంటున్నారు.

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ నిలుస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. కౌశల్ ఆర్మి పేరిట సోషల్ మీడియాలో గ్రూపులు పుట్టుకొస్తున్నాయి. కౌశల్ కోసం ఇటీవలే 2కె రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పైకి కాస్త హార్డ్ గా కనిపించి కౌశల్ మనసు సున్నితమైందని తాజా ప్రోమో చూస్తే అర్థమైపోతుంది.