రెండు క్రేజ్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి రేసులో దూకేశారు. సూపర్ హిట్ అనిపించుకొన్నారు. ఇక, మిగిలింది బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలయ్య ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.... ‘ఖబడ్ధార్’పై క్రిష్ క్లారిటీ

gouthami
రెండు క్రేజ్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి రేసులో దూకేశారు. సూపర్ హిట్ అనిపించుకొన్నారు. ఇక, మిగిలింది బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలయ్య ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ.. బాలయ్య ఏం చేస్తాడనే టెన్షన్ లో ఉన్నారు నందమూరి అభిమానులు.

అయితే, ఇప్పటి వరకు ‘గౌతమీ పుత్రశాతకర్ణి’పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు దర్శకుడు క్రిష్. శాతకర్ణి కోసం బాలీవుడ్ చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’ కోసం చేసి పెట్టిన గ్రాఫిక్స్ వర్క్స్ ని వాడుకున్నారని తెగ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై దర్శకుడు క్రిష్ స్పందించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశాడు. ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ ఆడియో వేడుకలో క్రిష్ అన్న ‘ఖబడ్ధార్’ అనే వ్యాఖ్య కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ఇది మెగా అభిమానులనే ఉద్దేశించి క్రిష్ అన్నాడని సోషల్ మీడియా వేడుకగా పెద్ద చర్చకే తెరలేచింది. ఇప్పుడీ వ్యాఖ్యపై క్రిష్ స్పష్టతనిచ్చారు. ఆ వ్యాఖ్య మెగా అభిమానులని ఉద్దేశించి అన్నది కాదన్నారు.

తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ.. శాతకర్ణి వీరత్వం తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది చూడాలి. అ

లేటెస్ట్ గాసిప్స్