chiru-balayya
ఈ సంక్రాంతికి రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150, నందమూరి నటసింహం బాలకృష్ణ 100 కెరీర్ లో మైలురాయి చిత్రాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఈ నెల 11న బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఆ మరుసటి రోజే 12న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 రిలీజ్ కానున్నండటంలో.. ఈ రెండు చిత్రాల మధ్య యుద్ధం అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంతో మెగా, నందమూరి అభిమానులు కాస్త ఉత్కంఠకి లోనవుతున్నాయి. దీంతో.. ఈ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయన్న టెన్షన్ తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. అయితే, ఈ యుద్దంపై నీళ్లు చల్లి.. అసలు విషయాలని విడమర్చి చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు క్రిష్. అభిమానం వేరు. మూర్ఖాభిమానం వేరు. సంక్రాంతి చిత్రాల మధ్య ఎలాంటి యుద్ధం జరగడం లేదని స్పష్టం చేశారు క్రిష్.

‘గౌతమిపుత్ర శాతకర్ణి ‘ప్రారంభానికి బాలకృష్ణ చిరంజీవిగారిని ఆప్యాయంగా ఆహ్వానించారు. చిరంజీవిగా విచ్చేసి… శుభాకాంక్షలు కూడా అందజేశారు. ఇప్పుడు తమ అభిమాన హీరో చిరు అందజేసిన శుభాకాంక్షలు అబద్ధం అవ్వాలని కోరుకోకూడదు. అలాగే.. నిజమైన బాలకృష్ణ అభిమానులు శుభాకాంక్షలు అందజేసిన చిరంజీవి సినిమా పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించకూడదు అంటూ చెప్పుకొచ్చారు క్రిష్.

మరీ.. క్రిష్ సూచనలని మెగా, నందమూరి అభిమానులు ఏ మేరకు పాటిస్తారన్నది చూడాలి.

లేటెస్ట్ గాసిప్స్