ఆ వెబ్ సైట్’ని టచ్ చేయడానికి కేటీఆర్ కూడా జంకుతున్నారు..!!

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినీ, రాజకీయ ప్రముఖులే కాకుండా సాధారణ వ్యక్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై వెంటనే స్పందిస్తుంటారు. ఐతే, టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన ఓ సమస్య విషయంలో ఎలాంటి స్పందన లేకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మూవీ రూల్స్‌ (movierulz) వెబ్‌సైట్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాల్సిందిగా కోన వెంకట్‌ సోషల్‌ మీడియా ద్వారా మంత్రి కేటీఆర్‌ ను కోరిన సంగతి తెలిసిందే. గత వారం విడుదలైన గాయత్రి, ఇంటిలిజెంట్‌, తొలిప్రేమ సినిమాలు ‘మూవీరూల్స్‌ సైట్‌’లో ఉన్న స్క్రీన్‌ షాట్‌ను కూడా పోస్ట్‌ చేశారు. ఐతే, ఈ ట్విట్ పై మంత్రి కేటీఆర్ నుంచి స్పందన లేదు. ఎలక్షన్స్ కు ముందు ఎందుకు వెబ్ సైట్స్ తో పెట్టుకోవడం అని లైట్ తీసుకొని ఉంటారనే గుసగుసలు వినబడుతున్నాయి.