‘దేవదాస్’ పండగ గిఫ్ట్ వచ్చేసింది.. !

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్-నానిల మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచేపోయిన టైటిల్ ఇది ఈ చిత్రంలో నాగ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో, ఆయన డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నారు. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన జతకట్టనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ వచ్చేసింది. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలోని తొలిసాంగ్ ‘వారువీరు.. ‘
ఇటీవలే విడుదల చేశారు. తాజాగా, ఈ సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది. అది కూడా గణేషుడి పాట కావడం విశేషం. ‘లక లక లకుమీకరా.. లంబోదరా…. ” అంటూ సాగే సాంగ్ అదిరిపోయింది. ఈ వినాయకుడి నవరాత్రోత్సవాలు దేవదాస్ పాట గల్లీ గల్లీలో మారుమ్రోగిపోవడం ఖాయం.

ఈ సాంగ్ ని నాని, నాగ్ లు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక, ‘పండగకి సాంగ్ కూడా సెట్.. స్టార్ట్ మ్యూజిక్’ నాని కామెంట్ పెట్టారు. ‘పందగ మొదలైపోయింది.. ‘ నాని దేవదాస్ సాంగ్ ని షేర్ చేశాడు.