నా పరువు తీస్తున్నారు : లక్ష్మీ పార్వతీ

ఎన్టీఆర్ మాజీ భార్య, వైకాపా మహిళా నేత లక్ష్మీ పార్వతీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. లక్ష్మీ పార్వతీ దగ్గర పనిచేసే కోటి అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. లక్ష్మీ పార్వతీ ఓ కామ పిశాచి. తన కోరికలు తీర్చుమని ఒత్తిడి తెస్తుంది. బెదిరిస్తోందని ఇటీవలే గుంటూరు పోలీసులకి ఫిర్యాదు చేశారు.

తాజాగా కోటి ఫిర్యాదుపై లక్ష్మీ పార్వతీ స్పందించింది. ఆయనపై రిటర్న్ కేసు పెట్టింది. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ మహేందర్‌రెడ్డికి కంప్లయింట్ చేసింది. నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనక ఉన్న వ్యక్తులని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది