‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లీకు వెనక ఎవరున్నారు.. ?


‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆన్ లైన్ లో లీకైంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎన్నికల్ కోడ్ అమల్లోకి రావడంతో లక్ష్మీస్ ఎన్ టీఆర్ విడుదలపై సస్పెన్స్ నెలకొంది. పైగా సినిమాని అడ్డుకొనేందుకు టీడీపీ వర్గాలు ట్రై చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. వర్మ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాని విడుదల చేసేందుకు ట్రై చేస్తున్నారు.

ఫైనల్ గా సినిమా విడుదల సాధ్యం కాకపోతే.. ఆన్ లైన్ లో సినిమాని వదిలేందుకు వర్మ వెనకాడడు. ఇప్పుడదే జరుగుతోంది. ఐతే, ఇది స్వయంగా వర్మ చేసిన పనా.. ? లేక ఇండస్ట్రీ మిగితా సినిమాల్లో లక్ష్మీస్ ఎన్ టీఆర్ లీకై ఉంటుందా.. ?? అన్నది తెలియాల్సి ఉంది. ఇక, ఈ సినిమా ద్వారా వర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు కనబడుతోంది.