‘మా’లో కొత్త వివాదం

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గతంలో శివాజీరాజా ప్యానల్ అక్రమాలకి పాల్పడిందని నరేష్ ప్యానల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. వీరు మా బాధ్యతలు తీసుకొని ఆరు నెలలు కూడా గడవక ముందే కొత్త వివాదం రాజుకొంది.

‘మా’ సభ్యుల కోసం ఖర్చు చేయాల్సిన ఏడున్నర లక్షల మొత్తాన్ని జీవిత రాజశేఖర్ కుమార్తె ఖాతాలోకి వెళ్లిపోయాయని వార్తలు గుప్పుమన్నాయి. అలా ఎందుకు జరిగిందని ఆరా తీయగా.. కొన్ని విషయాలు బయటకొచ్చాయి. మా సంఘ భవనం కోసం తెలంగాణా ప్రభుత్వాన్ని స్థలం అడగాలని అనుకున్నారు. దానికి ముందుగా ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాలనే ఐడియాతో తెలంగాణా ప్రభుత్వ పథకాలను పొగుడుతూ కొన్ని ప్రకటనలు చేయించి కానుకగా ఇద్దామని అనుకున్నారు. దానికోసం ఏడున్నర లక్షలు ఖర్చు చేసేశారు. ఈ మొత్తాన్ని మొదట జీవిత రాజశేఖర్ కుమార్తె భరించి.. ప్రకటనలు చేయించినట్లు చెబుతున్నారు.