మా వివాదం ముగిసిపోయింది


మా వివాదం సర్దుబాటుకు మార్గం సుగమం అయినట్లు కనిపిస్తోంది. వివాదాస్పద నిర్ణయాలు, స్కామ్ లు అంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలుగు సినిమా రంగ పరిశ్రమ పెద్దలు రంగప్రవేశం చేసి, మా సంఘ వ్యవహారాల్లో కలుగచేసుకొని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

దీనిపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ‘‘ఇటీవలే ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్‌ కమిటీ’ అని పెట్టుకున్నాం. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి అనుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా చిన్న సమస్య ఏర్పడింది. అది పరిష్కరించాం. ఇక నుంచి సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కలెక్టివ్‌ కమిటీనే చూస్తుంది. సాల్వ్‌ చేస్తుంది. ప్యూచర్‌లో చేసే ఈవెంట్స్‌ కూడా ఇది వరకులానే మాములుగానే చేస్తారు’’ నాయి చెప్పుకొచ్చారు.

‘టీఎఫ్‌సీసీ నిర్ణయమే మా అందరి నిర్ణయం. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. అన్ని ఫైల్స్‌నీ పెద్దల చేతుల్లో పెట్టాం. ఈ పెద్దలంతా మా ఇద్దరికీ చుట్టాలు కాదు. మొత్తం చూసి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెప్పారు; అన్నారు శివాజీ రాజా.