కర్ణాటక లో మహర్షి వసూళ్లు మాములుగా లేవు..

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మాములు వసూళ్లు రాబట్టడం లేదు..మొదటి వీకెండ్ లో ఏకంగా రూ. 6.07 కోట్లు షేర్ వసూలు చేసి శభాష్ అనిపించింది.

ఇందులో రూ. 3.45 కోట్లు బెంగుళూరు నగరం వచ్చిన కలెక్షన్లే కావడం విశేషం. దీన్ని బట్టి కర్ణాటకలో మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సోమవారం కూడా కలెక్షన్లు స్టడీ గా ఉండడం తో కర్ణాటక లో మహేష్ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో పూజా హగ్దే హీరోయిన్ గా నటించగా..అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు.