శ్రీవారిని దర్శించుకున్న మహర్షి టీం..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ సాధించడం తో చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శించుకున్నారు.

మహర్షి చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందుతుందని… స్వామి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపారు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నాల్గు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి వార్తల్లో నిలిచింది. ముఖ్యం గా ఈ చిత్రం నైజాం, గుంటూరు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ కుమ్మేసింది. ఇంకా స్టడీగా కలెక్షన్లు వస్తుండడం తో బయ్యర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహేశ్‌బాబు, అల్లరి నరేష్‌, పూజ హెగ్డే, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఈ చిత్రంలో నటించగా..పివిపి , దిల్ రాజు , అశ్విని దత్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.