‘మహర్షి’ టీజర్ ఎప్పుడంటే ?

సూపర్ స్టార్ మహేష్ బాబుని ‘మహర్షి’గా చూపించబోతున్నాడు దర్శకుడు వంశీపైడిపల్లి. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని మొదలు పెట్టనుంది చిత్రబృందం.

ఇందులో భాగంగా టీజర్ ని ఉగాధి కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయబోతున్నట్టు సమాచారమ్. మహర్షి మహేష్ మూడు విభిన్న గెటప్ లో కనిపించబోతున్నాడు. లేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా మహేష్ కనిపిస్తాడట. ఆ మూడు గెటప్ లోకి మహేశ్ మారడానికి కారణలేంటీ అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అల్లరి నరేష్ పాత్ర సినిమాని మలుపుతిప్పేలా ఉంటుందట.