#ఆర్ఆర్ఆర్ కోసం మహేష్’ని ఎందుకు తీసుకోలేదంటే ?


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విశేషాలని రాజమౌళి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రాజమౌళికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అల్లూరి సీతారామరాజుగా సూపర్ స్టార్ కృష్ణ నటించారు. సహజంగా ఇప్పట్లో మళ్లీ అల్లూరి పాత్ర అనగానే మహేష్ బాబు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది. అలాంటిది మీరు అల్లూరి పాత్ర కోసం మహేష్ ని తీసుకోకుండా రామ్ చరణ్ నే ఎందుకు తీసుకొన్నారనే ప్రశ్న ఎదురైంది.

దీనికి జక్కన్న సమాధానం ఇస్తూ.. ఓ సారి మహేష్ సినిమా ఫంక్షన్ కి వెఌతే అభిమానులు మహేష్ తో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. చేస్తాను మహేష్ తో ఎలాంటి సినిమా చేయాలని అడిగితే ఎవరు అల్లూరి సీతారామారాజు అని చెప్పలేదు. మహేష్ ని జేమ్స్ బాండ్ గా చూపించాలని కోరారని తెలిపారు. ఇక, ఈ మల్టీస్టారర్ లో తారక్ కొమరంభీం పాత్రలో చరణ్ అల్లూరి పాత్రలో కనిపించనున్నారు.