రేపు సుదర్శన్ థియేటర్ కు మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ..మహర్షి విషయంలో చాల కొత్త ప్రవర్తిస్తున్నాడు..గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొనడం..ఓ రేంజ్ లో మాట్లాడడం..కాలర్ ఎగరవేయడం..ఓ రేంజ్ లో స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవ్వన్నీ అభిమానులకు కొత్త ఉత్సహాన్ని ఇస్తుంది. ఇదే కాదు రేపు హైదరాబాద్లోని సుదర్శన్ 35 ఎంఎం ను మహేష్ సందర్శినున్నాడు. మహేష్ ఇంతకుముందెప్పుడూ ఇలా థియేటర్ విజిట్స్ చేసింది లేదు. అభిమానులు సైతం రేపు మహేష్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా చేయడం వలన సినిమా వసూళ్లు ఇంకొంత ఊపందుకుంటాయనేది ఆయన ఆలోచన.

మరోపక్క చిత్ర యూనిట్ సైతం చిత్ర విజయం పట్ల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శించుకున్నారు. మహర్షి చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందుతుందని… స్వామి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపారు.