మహేష్ బాబు మేటర్ పై టాలీవుడ్ సీరియస్

సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఓ తమిళ వ్యక్తి నోరు పారేసుకున్నాడు. తమిళనాట స్టాండప్‌ కమెడియన్‌గా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మనోజ్‌ ప్రభాకర్‌ .. మహేష్ ని దారుణంగా విమర్సించారు. అసలు మహేష్ బాబుకి నటనే రాదంటూ అవమానించాడు. మహేష్ నటనలో రాకింగ్ అంటూ.. ఆయన హావభావాలు ఇలా ఉంటాయి అంటూ రెండు రాళ్లను చూపించి వాటితో మహేష్ మఖాన్ని పోల్చాడు. ఇక తమిళ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ మూవీలో ఎస్ జే సూర్య ముందు తేలిపోయాడని.. ఆయనకు అసలు నటనే రాదంటూ సంచలన కామెంట్ చేశాడు.

కాగా, మహేష్ బాబుపై మనోజ్ ప్రభాకర్ చేసిన కామెంట్స్ విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ సీరియస్‍ అయింది. మహేష్ బాబు యాక్టింగ్ టాలెంట్, పర్సనాలిటీని కించ పరిచే విధంగా అతడు చేసిన కామెంట్స్‌పై అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్; కూడా రంగంలోకి దిగింది. సదరు కమెడియన్ మీద తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ తమిళ సినీ నటులకు చెందిన ‘నడిగర్ సంఘం’కు లేఖ రాసింది.