సుక్కుకు బర్త్ డే విషెస్ చెప్పిన సూపర్ స్టార్

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ వేదిక సుక్కుని విష్ చేశారు. ‘మోస్ట్‌ హంబుల్‌, సూపర్‌ టాలెంటెడ్‌ సుకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను సర్‌’ అంటూ ట్విట్ చేశారు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మహేష్ ‘వన్-నేనొక్కడినే’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా.. సుక్కుకి మరో అవకాశం ఇచ్చారు మహేష్. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సుక్కు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఐతే, ఈసారి మహేష్ కి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలనే కసితో సుక్కు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఓ మంచి కథ రెడీ చేశాడట. ఏప్రిల్ లో సుక్కు దర్శకత్వంలో మహేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.