మహేష్ మెచ్చిన ‘పేటా’

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేటా’ సంక్రాంత్రి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకొనే సినిమా ఇదని రివ్యూలు చెప్పేశాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రజనీ స్టయిల్ కి ఫిదా అయ్యాడు. పేటా పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.

“నాలాంటి రజినీకాంత్‌ అభిమానులందరికీ పేటా తో మంచి ట్రీట్ ఇచ్చారు. తలైవాకు వందనాలు. మనకున్న అద్భుతమైన టాలెంటెడ్ దర్శకులలో కార్తీక్ సుబ్బరాజ్ ఒకరు. ఎప్పటిలాగే సినిమాటోగ్రాఫర్ తిరు అద్భుతంగా పనిచేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన అందరికీ అభినందనలు` అని మహేష్ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్. మహర్షి ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.