మహేష్ ఫ్యామిలీ పారిస్ లో.. !


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వేయడం అలవాటు. మహర్షి సినిమా పూర్తికాగానే మహేష్ ఫ్యామిలీ ఫారిన్ చెక్కేసింది. పారిస్ లో వాలిపోయింది. అక్కడ కుటుంబంతో కలిసి మహేశ్ సేద తీరుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పారిస్ వెకేషన్ ఫోటోలను మహేష్ బాబుతో పాటు ఆయన సతీమని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆదివారం ఈస్టర్ పండుగ కావడంతో ఈ సందర్భంగా అందరినీ విష్ చేస్తూ నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. కుటుంబంతో కలిసి పారిస్‌లో ఒక సాయంత్రం అద్భుతంగా గడిచింది అంటూ మహేష్ బాబు తన ఇన్‍‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.