గీత దర్శకుడితో మహేష్ సినిమా


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. ఈ రెండు సినిమాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహెష్ సినిమా ఉండనుంది.

ఇప్పుడీ సినిమా గురించి కొత్త అప్ డేట్ వచ్చేసింది. ముందునుంచి గీతలో తెరకెక్కనున్న మహేష్ సినిమా కోసం ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు వార్తలొచ్చాయ్. ఇప్పుడీ సినిమా కోసం పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది.

మహేశ్ కోసం పరశురామ్ ఓ కథని రెడీ చేశాడు. దాన్ని త్వరలోనే మహేష్ కి వినిపించేందుకు అరవింద్ ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. కథ నచ్చితే.. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది.