‘మజిలీ’కి సంగీత దర్శకుడు మారాడు


సమంత-నాగ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. పెళ్లి తర్వాత చై-సామ్ నటిస్తున్న తొలి చిత్రమిది. ఏప్రిల్ 5న మజిలీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. రీ రికార్డింగ్, డబ్బింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడీ సినిమా నుంచి సంగీత దర్శకుడు గోపీ సుందర్ తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా కోసం గోపి సుందర్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన పాటలు అందించారు. రీ-రికార్డింగ్ మాత్రం అలాగే మిగిలి ఉంది. ఐతే, తన పర్సనల్ రీజన్స్ వలన ఈ సినిమా నుండి గోపీ తప్పుకుంటున్నారు. దీంతో మిగిలిపోయిన రీ రికార్డింగ్ పనులని థమన్ టేకప్ చేసినట్టు తెలిసింది. ఈ మధ్య థమన్ అద్భుతమైన రీరికార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మజిలీ కోసం ఆయన పని మొదలెట్టారు.