వి.వి. వినాయక్.. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు. అప్పట్లోనే ‘ఆది’తో అదరగొట్టాడు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకొన్నాడు. అయితే, మెగా ఖైదీ తర్వాత... వినాయక్ దర్శకత్వంలో మనోజ్ !

VV-Vinayak

వి.వి. వినాయక్.. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు. అప్పట్లోనే ‘ఆది’తో అదరగొట్టాడు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకొన్నాడు. అయితే, మెగా ఖైదీ తర్వాత వినాయక్ కి స్టార్ హీరోలు ఎవ్వరు అందుబాటులో లేరు. ఈ క్రమంలో యంగ్ హీరోలు సాయిధరమ్ తేజ్, గోపీచంద్ లలో ఒకరితో వినాయక్ సినిమా ఉండొచ్చని చెప్పుకొన్నారు. కానీ, అలా జరగలేదు. ఇప్పుడు మంచు మనోజ్ హీరోగా వినాయక్ ఓ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు సమాచారమ్.

ఇప్పటికే కథ ఓకే అయ్యింది. నిర్మాతలు, బడ్జెట్ తదితర విషయాలపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మాస్ కథలకి మంచు మనోజ్ సరిగ్గా సరిపోతాడు. మంచి మాస్ కథ పడితే హిట్ కొట్టేయగల టాలెంట్ ఉంది. ఈ క్రమంలో వినాయక్ – మనోజ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.

మనోజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ సీక్వెల్ ని ప్లాన్ చేసే పనిలో పడతాడట వినాయక్. ఇప్పటికే అదుర్స్ సీక్వెల్ పై ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెగా ఖైదీతో వినాయక్ బిజీగా లేకపోతే.. జనతా గ్యారేజ్ తర్వాత అదుర్స్ సీక్వెల్ పట్టాలెక్కేదే.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్