తరుణ్ ప్రేమకు మంచు మనోజ్ అతిథి

లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకొన్న యంగ్ హీరో తరుణ్. ఐతే, ఆయన చాలా గ్యాప్ తర్వాత ‘ఇది నా లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) తన లవ్ స్టోరీని ప్రేక్షకులకి చూపించబోతున్నాడు.

ఐతే, ఈ సినిమా రిలీజ్ ముందు ఓ ట్విస్ట్’ని రిలీవ్ చేశారు. ఈ సినిమాలో మంచువారి హీరో మంచు విష్ణు అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది తెలిసిన జనాలు తరుణ్ ప్రేమకు మనోజ్ ముఖ్య అతిథి అని చెప్పుకొంటున్నారు.

ఈ చిత్రంలో తరుణ్ సరసన బిగ్‌బాస్‌ ఫేం ఓవియా జతకట్టనుంది. రమేష్‌, గోపిలు సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రమిది. మరీ.. ఈ సినిమాతో తరుణ్ మళ్లీ ఫాంలోకి వస్తాడేమో చూడాలి.