మీనా మళ్లీ తల్లయ్యింది !

meena

సీనియర్ హీరోయిన్ మీనా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడింది. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. అయితే, రీ-ఎంట్రీ తర్వాత ప్రాధ్యానత ఉన్న పాత్రల్లో నటిస్తోంది. తెలుగు ‘దృష్యం’లో వెంకటేష్ భార్యగా టీనేజ్ అమ్మాయికి తల్లిగా నటించింది. తల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయిందనే ప్రశంసలు అందుకొంది.

ఇప్పుడు మరోసారి మీన తల్లిగా కనిపించనుంది. శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ తల్లి పాత్ర కోసం మీనాని తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మీనా తల్లి పాత్రకి సంబంధించి కొన్ని సీన్స్ ని చిత్రీకరించినట్టు తెలుస్తోంది. మరి.. మరోసారి ఈ సీనియర్ హీరోయిన్ తల్లిగా ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి.

ఇక, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన బోయపాటి – బెల్లకొండల ‘జయ జానకి నాయక’ మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. మరో రెండు క్రేజీ సినిమాల మధ్య విడుదలైన ఈ చిత్రం సేఫ్ గా బయటపడటం కష్టమనే టాక్ వినిపిస్తోంది.