సంక్రాంత్రి సీజన్ మెగా హీరోలకి కలిసిరావడం లేదబ్బా.. !


సంక్రాంత్రి సీజన్ మెగా హీరోలకి అచ్చొచ్చినట్టు కనిపించడం లేదు. గత సంక్రాంత్రికి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ ‘అజ్ఝాతవాసి’ అట్టర్ ప్లాప్ అయ్యింది. అంతకుమించి కాపీ రైట్స్ వివాదంతో దర్శకుడు త్రివిక్రమ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. దాన్నుంచి ‘అరవింద సమేత’ హిట్ తర్వాత గానీ త్రివిక్రమ్ తేరుకోలేదు.

ఇక, ఈ సంక్రాంత్రి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్ వినయ విధేయ రామ కూడా అజ్ఝాతవాసి రిజల్ట్ ని రిపీట్ అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన వివిఆర్ నెటివిట్ టాక్ సొంతం చేసుకొంది. పోటీ మరో రెండు పెద్ద సినిమాలు ఉండటంతో వివిఆర్ కి భారీ నష్టాలు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కథ-కథనాలపై దృష్టిపెట్టకుండా సినిమా అంతా యాక్షన్ తో నింపేయడం దెబ్బతీసిందని టాక్.