మెహ్రీన్’ని చంపేస్తారట !

బెల్లంకొండ హీరోగా నటిస్తున్న ‘కవచం’ సినిమాలో కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఇంకా చెప్పాలంటే సినిమాలో మెహ్రీన్ పాత్ర ఏంటన్నది లీకైంది. సినిమాలో మెహ్రీన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమెది చాలా తక్కువ నివిడి ఉన్న పాత్ర. సినిమాలో మెహ్రీన్ చనిపోతుందట. ఆమె మర్డర్ మిస్టరీని చేధించడంతో పాటు కాజల్ కు సంబంధించిన ఓ సస్పెన్స్ కు తెరదించే క్రమంలో హీరో ఓ మిషన్ ప్రారంభిస్తాడు. అదే కవచం సినిమా కథ అని చెబుతున్నారు.

కాజల్ కు సంబంధించిన ట్విస్ట్ ఏంటీ ? బెల్లకొండకి మెహ్రీన్ ఏమవుతుంది.. ?? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. వాస్తవానికి సినిమాలో తన పాత్ర చనిపోవడంపై మెహ్రీన్ ఒప్పుకోలేదట. ఐతే, నిర్మాతలు ఆమె కన్విన్స్ చేశారట. దీనికితోడు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్టు సమాచారమ్.