ఎక్స్ ప్రెస్ దర్శకుడితో చైతూ సినిమా ?

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలతో ఎక్స్ ప్రెస్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకొన్నాడు మేర్లపాక గాంధీ. ఆయన దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ మంచి సినిమా అనిపించుకొన్నా.. కమర్షియల్ గా ఆడలేడు. దీంతో.. కాస్త గ్యాప్ తీసుకొన్న గాంధీ తన నాల్గో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవలే నాగచైతన్యని కలిసి కథ చెప్పి.. ఓకే చేసుకొన్నాడట. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ నిర్మించనుంది.

ప్రస్తుతం చైతు మజిలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. పెళ్లి తర్వాత సామ్-చైతూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. శివ నిర్మాణ దర్శకుడు. దీంతోపాటు మేనమామ విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చైతూ సినిమా ఉండనుంది.