తెలుగులో హిట్..హిందీ లో ఫట్

పెళ్లి చూపులు ఈ సినిమా తెలుగునాట ఎంతటి విజయాన్ని అందుకుందో తెలియంది కాదు..లో బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా 2016 లో విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ చిత్ర విజయంతో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రీతు వర్మల స్టేటస్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యం గా విజయ్ రేంజ్ ఓ రేంజ్ వెళ్లింది.

అందుకే ఈ సినిమాను హిందీలో ‘మిత్రోన్’ పేరుతో రీమేక్ చేశారు. గత శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. నితిన్ కక్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హిందీ లో పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. తెలుగులో రివ్యూస్ బ్రహ్మరధం పడితే హిందీ లో మాత్రం సినిమాను ప్లాప్ గా తేల్చసాయి. దీంతో కలెక్షన్లు పెద్దగా రాబట్టలేకపోయింది. హిందీ లో కూడా మంచి విజయం అందుకుంటుందని అనుకున్న వారికీ నిరాశే ఎదురయ్యింది.