Mr పర్ఫెక్ట్ కాపీ కథ.. తేల్చిన కోర్టు !


2011లో వచ్చిన ప్రభాస్ ‘Mr పర్ఫెక్ట్’ సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ కి జంటగా కాజల్, తాప్సీ నటించారు. దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా కథ 2010లో విడుదలైన ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవల నుంచి కాపీ కొట్టిందనే ఆరోపణలు వచ్చాయి. రచయిత ముమ్ముడి శ్యామల దేవి కోర్టుకు కూడా వెళ్లారు. ఎట్టకేలకు ఆమె న్యాయ పోరాటం ఫలించింది.

ఈ సినిమాలో కథ, మాటలు, సన్నివేశాలు ముమ్మడి శ్యామలా దేవి రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల నుంచి తీసుకున్నదే అని సిటీ సివిల్ కోర్టు నిర్దారించింది. ఈ కేసు విషయంలో చట్టపరమైన చర్యలకు పోలీసు శాఖను ఆదేశించింది. ప్రతి నవల 3 నెలల్లో పూర్త చేస్తాను. ఇది సంవత్సరం పట్టింది. క్యారెక్టర్స్ అంత గొప్పగా తీర్చి దిద్దాను కాబట్టే ఎక్కువ సమయం తీసుకుంది. దాదాపు 30
సీన్ల వరకు ఉన్నది ఉన్నట్లు దించేశారు. రచయిత చెబుతోంది. మరీ.. పోలీసు కేసు నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మ్యూల్యం చెల్లించక తప్పదేమో.. !