విజయ్ దేవరకొండ గెస్టుగా మురగదాస్ !


సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘నోటా’. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్‌ల తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్‌ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు.

ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘నోటా’ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.. మురుగదాస్‌ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్‌ చేస్తుండటంపై ఆనంద్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ పొలిటికల్‌ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ విడుదలకి రెడీగా ఉంది. ప్రస్తుతం విజయ్ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులోనూ విజయ్ సరసన రష్మిక మందన జతకట్టనుంది.