బిగ్ బాస్ హౌస్’లో దేవదాస్

బిగ్ బాస్ సీజన్ 2 ఆసక్తిగా సాగుతోంది. వంద రోజుల బిగ్ బాస్ షో 60రోజులకి పైగా పూర్తయ్యింది. మిగిలిన ఏపీసోడ్స్ డబుల్ ఎంటర్ టైనర్ పంచేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా దేవదాస్ ని హౌస్’లోకి పంపించనున్నట్టు సమాచారమ్. ఇంతకీ ఆ దేవదాస్ ఎవరు ? అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇప్పుడైతే.. నాగ్, నాని లు ఇద్దరు. వీరిద్దరు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారు నాగ్. దేవదాసు సినిమాలో బిగ్ బాస్ కి హోస్టింగ్ చేస్తున్న నాని నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు. అందుకే శని లేదా ఆదివారాలలో దేవదాసు టీమ్ కి అవకాశం ఇవ్వాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తుంది. అంతేకాక శని,ఆదివారాల్లో విపరీతమైన ప్రేక్షక ఆదరణ ఉంటుంది. అందుకే దీనిని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో దేవదాసు టీమ్ ఉందట.