కోడలుపై నాగ్ నమ్మకం

nagarjuna
నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాజు గారి గది 2’. సమంత, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఓంకార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో నాగార్జున తన కోడలు సమంత గురించే ఎక్కువగా మాట్లడారు.

‘సమంత కి నేను ఫ్యాన్ ని. ఏం మాయ చేశావే సమయంలోనే. ఈ సినిమా క్లైమాక్స్‌లో నాకంటే బాగా చేసింది మా కోడలు పిల్ల. ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే.. అక్టోబరు 6న చైతన్యకు-సమంతకు పెళ్లైంది. ఇంటికి కోడలుగా వచ్చింది. ఈ సినిమా హిట్‌ అవ్వాలి. ఎప్పుడూ లేని టెన్షన్‌ ఇది. మేమెప్పుడూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నప్పుడల్లా.. పెళ్లైన తర్వాత కోడలు నా ఇంటికి ఓ హిట్‌ తీసుకొచ్చింది అని అందరూ చెప్పుకోవాలి. అలా జరుగుతుందని నమ్మకం ఉంది’ అని నవ్వేశారు నాగ్