కొన్నాళ్లుగా బాలకృష్ణ – నాగార్జున కుటుంబాల మధ్య తత్సంబంధాలు లేవని చెబుతుంటారు. వీరిద్దరు ఒకే వేదికపై కనబడి చాన్నాళ్లయ్యింది. ఇందుకు కారణాలు ఏంటన్నది మాత్రం స్పష్టంగా తెలీదు. అలాంటిది బాలకృష్ణకి నాగార్జున శుభాకాంక్షలు... బాలయ్యకి నాగ్ శుభాంక్షలు

gouthami
కొన్నాళ్లుగా బాలకృష్ణ – నాగార్జున కుటుంబాల మధ్య తత్సంబంధాలు లేవని చెబుతుంటారు. వీరిద్దరు ఒకే వేదికపై కనబడి చాన్నాళ్లయ్యింది. ఇందుకు కారణాలు ఏంటన్నది మాత్రం స్పష్టంగా తెలీదు. అలాంటిది బాలకృష్ణకి నాగార్జున శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రం కోసం నందమూరి అభిమానులు, సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తెలిపారు. స్వయంగా నాకు చారిత్రాత్మక చిత్రాలంటే ఇష్టం. చారిత్రాత్మక చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్న బాలకృష్ణ, దర్శకుడు, క్రిష్, శాతకర్ణి టీంకి ఆల్ ది బెస్ట్. శాతకర్ణి హిస్టరీ క్రియేట్ చేయాలని ఆకాంక్షిస్తూ అంటూ ట్విట్ చేశారు నాగ్.

ఇప్పుడు బాలకృష్ణకి నాగ్ శుభాకాంక్షలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. నాగ్ విషెస్ పై బాలయ్య స్పందిస్తారా.. ? అన్నది ఆసక్తిగా మారింది. నాగ్ విషెస్ పై నాగ్ స్పందిస్తే మాత్రం వీరిద్దరి మధ్య విబేధాలున్నాయన్నది రూమర్ గానే భావించవచ్చు.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్