నాగ్-నాని..అమెరికాలో మ్యూజిక్

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 18 ఉగాది రోజు నుంచి జరుగుతుంది.

తాజాగా అమెరికాలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ ”మా వైజయంతి బేనర్‌లో మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్‌ అయ్యాయి. ఈ సినిమాని కూడా మ్యూజికల్‌గా బిగ్గెస్ట్‌ హిట్‌ చెయ్యాలని ఫుల్‌గా కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమాలోని సాంగ్స్‌ని మణిశర్మ కంపోజ్‌ చేస్తున్నారు. మూడు పాటలకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ అక్కడ జరుగుతున్నాయి. మార్చి 18 ఉగాది రోజు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం’అన్నారు