శ్రీదేవి మరణం.. ఓ చెడు కల

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఆక‌స్మికంగా మరణం సినీ ఇండస్ట్రీ, ఆమె అభిమానులని షాక్ కు గురిచేసింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీదేవి మరణం పట్ల సంతాపం తెలియజేశారు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణం త‌న‌ను షాక్ గురిచేసిందన్నారు. అసలు ఆమె ఎందుకు వెళ్లిందో అనే విష‌యం గురించే ఆలోచిస్తున్నా. ఆమె మరణం అనేది ఒక చెడు కల లేదా చెడు జ్ఞాపకంగానే భావిస్తా. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు నాగ్.

శ్రీదేవి మరణంపై ప్రముఖ హీరో రవితేజ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మరణం తప్పకుండా చిత్ర పరిశ్రమకు భారీ లోటు. ఆమె మరణించిందన్న వార్తను తానిప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆమె లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాన్నారు.