నాగ్ వెనుక 30 లక్షలు..

nagarjuna

టాలీవుడ్ కింగ్ నాగార్జున వెనుక 30 లక్షల మంది పడుతున్నారు..అదేంటి అనుకుంటున్నారా..మీము చెప్పేది నాగార్జున ట్విట్టర్ పేజీ ఫాలోవర్స్‌ గురించి. నాగ్ ట్విట్టర్ పేజీ ఫాలోవర్స్‌ సంఖ్య 30 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా ఆయన సోషల్‌మీడియాలో స్పందించారు. తనపై చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

NAG-Twitter
ట్విటర్‌ ఫాలోవర్స్‌ పరంగా ప్రపంచ వ్యాప్తంగా నాగ్‌ 260 స్థానంలో ఉండగా, రోజుకు దాదాపు 5 వేల మంది కొత్తగా ఆయన్ను ఫాలో అవుతున్నారు. నాగార్జునని ఇంత మంది ఫాలో అవుతున్నా.. ఆయన కేవలం ఒకర్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. ప్రస్తుతం నాగార్జున ఓంకార్ దర్శకత్వం లో ‘రాజుగారి గది-2’ సినిమాను చేస్తున్నాడు. ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించగా సమంత, సీరత్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజల్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అక్టోబరు 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక , నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.