నాగ‌శౌర్య ‘అమ్మ‌మ్మ‌గారి ఇల్లు’ ఫస్ట్ లుక్

యంగ్ హీరో నాగశౌర్య ‘ఛలో’ హిట్’తో మూడులో ఉన్నాడు. ఈ మూడులోనే ఏకంగా మూడు సినిమాలని లైన్లో పెట్టేశాడు. వీటిలో ‘అమ్మమ్మగారి ఇల్లు’ ఒకటి. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌కత్వంలో నాగశౌర్య-షామిలీ జంటగా తెరకెక్కనుంది.

తాజాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. టైటిల్ కు తగ్గట్టుగా ఊయల్లో కూర్చొన్న అమ్మమ్మకి ఇరువైపు నిల్చున్న హీరో-హీరోయిన్స్ లిస్టుని ఫస్ట్ లుక్ గా వదిలారు. ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించనున్నారు.

మరోవైపు, నాగ‌శౌర్య‌ – సాయి పల్ల‌వి జంట‌గా నటించిన “క‌ణం” సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.