మజిలీ నుంచి మరో లిరికల్ సాంగ్.. విన్నారా.. ?


సమంత-నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. ఏప్రిల్ 5న ‘మజిలీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టింది చిత్రబృందం. ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్ ని వదిలారు. తాజాగా, మూడో లిరికల్ సాంగ్ ‘నా గుండెల్లో.. ‘ లిరికల్ వీడియోని విడుదల చేశారు.

ఈ సాంగ్‌కి గోపీ సుందర్ స్వరాలను సమకూర్చగా.. రామ్ బాబు గోసల సాహిత్యం అందించారు. యాజిన్ నిజార్, నికితా గాంధీ ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించారు. ఈ సాంగ్ కూడా సంగీత ప్రియులని అలరిస్తుంది. పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథగా మజిలీ తెరకెక్కుతోంది. పెళ్లి తర్వాత సామ్ చై కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో మజిలీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.