వెంకీ కోసం అంత సిద్ధం చేశారట..

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకటేష్..ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో నాగ చైతన్య తో కలిసి వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పూర్తి చేశారట త్రినాధ్.

వెంకీ మామ షూటింగ్ పూర్తీ అవ్వడమే ఆలస్యం వెంటనే ఈ సినిమాను స్టార్ట్ చేయాలనీ త్రినాద్ సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో వెంకేటేష్ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించబోతున్నారు.