మోక్షజ్ఞ అలా రెడీ అవుతున్నాడు

Nandamuri-Mokshagna
నందమూరి ఫ్యామిలీ నుండి మరో వారసుడు తెరంగేట్రం చేయనున్నాడు. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ వెండితరపైకి రానున్నాడు. ఈలోగా మోక్షజ్ఞ గురించి ఒక రూమర్ కూడా వచ్చింది. బాలయ్య తీయిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో చిన్ననాటి బాలయ్యగా కనిపించనున్నాడని అని కూడా అంటున్నారు.

ఇదీలావుంటే.. మోక్షజ్ఞ హీరోగా మార‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశాడు. కొంత‌కాలంగా మోక్షూ ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. త‌న ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డం లేదు. సెల్ఫీల‌కూ దూరంగా ఉంటున్నాడు. దాంతో మోక్ష‌జ్ఞ ఇప్ప‌టి రూపం ఏమిట‌న్న‌ది చాలా మందికి తెలీదు. అలాగే మోక్ష‌జ్ఞ బ‌రువు త‌గ్గి, బాడీ పెంచ‌డంతో పాటు, సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకొంటున్నాడ‌ని తెలుస్తోంది.