నమిత పెళ్లి శుభలేఖ ఇదిగో.. !

namitha
బొద్దుగుమ్మ నమిత పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. తన బాయ్‌ఫ్రెండ్‌ వీరేంద్ర చౌదరిని పెళ్లాడబోతుంది. ఈ నెల 24న వీరి వివాహం తిరుపతిలో జరగనుంది. పెళ్లి శుభలేఖ కూడా రెడీ అయ్యింది. ఇప్పుడీ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

namitha weddng

ఈ వివాహ పత్రికలో నమిత, వీరేంద్ర చౌదరి సంగీత్ ఫంక్షన్ నవంబర్ 22న తిరుపతి సింధూరి పార్క్ హోటల్‌లో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. పెళ్లి నవంబర్ 24 శుక్రవారం తిరుపతి‌లోని ఇస్కాన్‌లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు జరుగనుందని ఉంది.
Namitha-Latest-Stills

మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. మా బెస్ట్‌ఫ్రెండ్ శశిధర్ బాబు ద్వారా గతేడాది సెప్టెంబర్‌లో నేను, వీర్ ఒకరికొకరు పరిచయమయ్యాం. ఆ తరవాత మా మధ్య స్నేహం బలపడింది నమిత చెప్పింది.