నాని కూడా ‘ఫిదా’ చేస్తాడట

నేరుచల్ స్టార్ నాని వరుస హిట్స్’తో ప్రేక్షకులని ‘ఫిదా’ చేస్తున్నాడు. ప్రేక్షకులకు ‘ఫిదా’ చూపించిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేయబోతున్నట్టు సమాచారమ్. ఈ చిత్రాన్ని ఏసియన్ ఫిల్మ్ బ్యానర్ నిర్మించనుంది.

ఇటీవలే శేఖర్ కమ్ముల నానిని కలిసి ఓ లైన్ ని వినిపించడాట. అది నానికి కూడా నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారమ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘మే’ నెలలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

ప్రస్తుతం నాని ‘కృష్ణార్జునయుద్ధం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు, నాని నిర్మాతగా వ్యవహరించిన ‘అ!’ సినిమా ఈ శుక్రవాం ప్రేక్షకుల ముందుకు రానుంది.