నానికి మళ్ళీ పెళ్లి


నని ‘జెర్సీ’ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాత్‌ కథానాయిక. ఓ క్రికెటర్‌ జీవితం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ రోజు హోలీ పండుగను పురస్కరించుకుని చిత్రబృందం ఈ సినిమాలోని ‘అదేంటోగానీ ఉన్నపాటుగా..’ అనే పాట టీజర్‌ను విడుదల చేసింది. పాట మధ్యలో నాని..‘ఊరెళ్తున్నావా?’ అని కథానాయిక శ్రద్ధను అడుగుతాడు. ఇందుకు శ్రద్ధ అవును అన్నట్లు కోపంగా చూస్తుంది. అప్పుడు నాని.. ‘స్నానం చేసొస్తా.. పెళ్లి చేసుకుందాం’ అని చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. . సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది