నాని లవ్వర్స్ డే గిఫ్ట్


నేచురల్ స్టార్ నాని లవ్వర్ డే గిఫ్ట్ ని రెడీ చేశాడు. ఆయన తాజా చిత్రం ‘జెర్సీ’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ సినిమా కోసం నాని కొంతకాలం పాటు క్రికెట్ ఆటలో శిక్షణ కూడా తీసుకొన్నారు. ఇందులో నాని మూడు ఢిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడట. యువకుడిగా, మధ్య వయస్కుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ ను వాలంటైన్స్ డే సందర్భంగా ఈనెల 14న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియాజేస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నాని రొమాంటిక్ మూడ్ లో కనిపిస్తున్నాడు. బైక్ పై హీరోయిన్ షికారు చేస్తున్న పోస్టర్ ఆయన అభిమానులకి తెగ ఆకట్టుకుంటోంది.