మహిళల కోసం నాని మెసేజ్


నేచురల్ స్టార్ నాని మహిళల కోసం మెసేజ్ ఇవ్వబోతున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నాని అధికారంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ‘గర్ల్స్ ఇది మీ కోసమే !’ అనే కామెంట్ పెట్టాడు. నాని ఆ కామెంట్ ఎందుకు పెట్టాడంటే.. ? సోషల్ మెసేజ్ తో కూడిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట. మహిళలకి సంబంధించిన సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాడట. పైగా పూర్తి థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారమ్.

ప్రస్తుతం నాని ‘జెర్సీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ వచ్చే యేడాది ఫిబ్రవరి 19 నుండి మొదలుకానుందని సమాచారమ్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక, వరుస హిట్స్ దూసుకెళ్తున్న నాని జైత్ర యాత్రకు ‘కృష్ణార్జున యుద్ధం’ బ్రేక్ వేసింది. ఆ తర్వాత నాగ్ తో కలిసి నాని నటించిన దేవదాస్ యావరేజ్ సినిమాగానే నిలిచింది. ఈ నేపథ్యంలో నాని మరో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.