నాని కొడుకు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?


గౌతమ్ తిన్నమూరి దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘జెర్సీ. శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్. ఈ వారమే జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన దక్కింది. ట్రైలర్ లో కొడుకు కోసం నాని పడే తపన ఎమోషన్స్ ని టచ్ చేసింది. నాని కొడుకుగా నటించిన బుడ్డోడి పేరు రోనిత్ కామ్రా.

ఢిల్లీ లవ్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్నాడు. చిన్ని చిన్ని యాడ్స్ చేస్తూ కెరీర్ ని చిన్న వయస్సులోనే ఆరంభించి మంచి మోడల్ అయ్యాడు. పెద్ద పెద్ద స్టార్స్ తో కల్సి యాడ్స్ లో కూడా నటించాడు. చిన్ననాటి నుంచి వివిధ గెటప్స్ తో ఫేస్ బుక్ లో ఫేమస్ గా మారిన కామ్రా ఆతర్వాత యాడ్స్ లో పాపులర్ గా మారి ఇప్పుడు మూవీస్ లో కూడా నటిస్తూ దుమ్మురేపుతున్నాడు.