నరేష్ పాత్రపై తప్పుడు ప్రచారం


మహర్షిలో కామెడీ హీరో అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనది సినిమాని మలుపు తిప్పే పాత్ర. సినిమాలో స్నేహితుడు నరేష్ చనిపోవడంతో.. మహేష్ రైతుల సమస్యలపై పోరాటం మొదలుపెడతాడనే ప్రచారం జరుగుతోంది. ఐతే, ఇందులో నిజం లేదట. సినిమాలో నరేష్ పాత్ర చనిపోదట.

అల్లరి నరేష్ చనిపోవడం లాంటి విషాదకరమైన సీన్లు ఏమీ ఉండవని, అలాంటి రూమర్స్ నమ్మవద్దని చిత్ర బృందం నుంచి వినిపిస్తున్న మాట. హీరో విదేశాల నుంచి ఇండియా వచ్చి రైతులకు సహాయం చేసే ఒక అద్భుతమైన కాన్సెప్టు సినిమా ఉంటుందని చెబుతున్నారు. యూత్, ఫ్యామిలీ, రైతులు, బిజినెస్ పర్సన్స్ ఇలా అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుందని సమాచారమ్.