క్రిష్ కు చంద్రబాబు అభినందన


ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సంక్రాంత్రి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ సొంతం చేసుకొంది. సినిమా బాగుందంటూ ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిరిపోయారు. దర్శకుడు క్రిష్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని కితాబిస్తున్నారు. ఈ ఉదయం ఎన్టీఆర్-కథానాయకుడుని వీక్షించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమాపై ప్రశంసలు కురిపించారు. అక్కడి ఆగకుండా.. ట్విట్టర్ వేదికగా దర్శకుడు క్రిష్, బాలయ్యని అభినందించారు.

‘ఎన్టీఆర్ సినిమా ఎనలేని స్ఫూర్తిని నింపింది. 30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో చూపి మహానటుడి జీవితాన్ని, త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపమిచ్చిన దర్శకుడు @DirKrish, ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన బాలయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అంటూ ట్విట్ చేశారు చంద్రబాబు. దీనిపై థాంక్యూ సర్.. అంటూ క్రిష్ రిప్లై ఇచ్చారు.